రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్ ఇచ్చింది. రాఖీలు కట్టేందుకు వీలుగా సోదర,సోదరీమణులకు రైళ్లలో రాకపోకలు సాగించేందుకు వీలుగా మరిన్ని రైళ్లు నడపాల్సిన రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లనే రద్దు చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా గురువారం 149 రైళ్లను రద్దు చేస్తూ ఇండియన్ రైల్వేస్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.మరో 16 రైళ్ల రాకపోకల స్టేషన్లను మార్చింది. మరో 15 రైళ్లను దూరప్రయాణాన్ని కుదించింది. రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, న్యూఢిల్లీ, జమ్మూ అండ్ కశ్మీర్, పశ్చిమబెంగాల్, అసోం, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేయడంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.