హర్ ఘర్ తిరంగాలో భాగంగా 13 నుంచి 15 వరకు ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రాల్లో త్రివర్ణ పతకాల పంపిణీ జరుగుతోంది. అయితే జాతీయ జెండా ఎగురవేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
* త్రివర్ణ పతకాన్ని జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకల్లో మాత్రమే ఎగురవేస్తారు.
* జెండా ఎగురవేసేటప్పుడు కాషాయం రంగు పైకి ఉండాలి
* జాతీయ జెండాను ఏ వస్తువులు, భవనాలు మొదలైన వాటిని కవర్ చేయడానికి ఉపయోగించకూడదు.
* నడిచే దారిలో, నేలపై, నీటిలో వేయకూడదు.
* జెండా మంచిగా ఉండేలా చూసుకోవాలి. చిరిగినా, పాడైనా, నలిగినా, తిరగబడినా వాడకూడదు.
* జాతీయ జెండాను ఎగురవేసే ఎత్తులో మరే ఇతర జెండా ఉండకూడదు.
* డెకరేషన్‌కు జెండా వాడకూడదు.
* జెండాపై ఎటువంటి రాతలు రాయకూడదు. అవసరమైతే పువ్వులు మాత్రమే ఉంచాలి.
* జెండా కట్టే కర్ర మీద పూలు, ఆకులు, దండలు మొదలైనవి పెట్టకూడదు.
* జెండాను డ్రెస్సులుగా కుట్టించకూడదు. నడుము భాగంలో చుట్టకూడదు. రుమాలు, న్యాప్‌కిన్ తదితరులుగా వాడకూడదు.
* జెండా కర్రకు చిట్ట చివరన ఎగురవేయాలి. సగం కిందకు దించి ఎగురవేయకూడదు.
* ఫ్లాగ్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించినవారికి జైలు శిక్ష పడుతుంది.