ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకున్న శక్తిమాన్, మహాభారతం ధారావాహికల ద్వారా అందరి మన్నలను పొందిన సీనియర్ నటుడు ముకేశ్ ఖన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్స్‌ను కోరే బాలికలను వ్యభిచారులతో పోల్చారు. ‘ఒక బాలిక సెక్స్ కావాలని అబ్బాయిని కోరితే, ఆమె బాలిక కాదు.. వ్యభిచారి.
ఎందుకంటే నాగరిక సమాజానికి చెందిన వారెవరూ అలాంటి పనులు చేయరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తన యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేసిన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసు జారీచేసింది.