Home / MOVIES / గంటకు రూ.10 కోట్లు.. ఫ్యాన్స్‌ కోసం నో చెప్పిన బన్నీ

గంటకు రూ.10 కోట్లు.. ఫ్యాన్స్‌ కోసం నో చెప్పిన బన్నీ

యాడ్‌లో కేవలం గంటపాటు నటిస్తే రూ.10 కోట్లు ఇస్తామని స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఓ సంస్థ. కానీ బన్నీ ఆ ప్రకటనలో నటించడానికి ఇష్టపడలేదు. తనను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్‌కు దానివల్ల నష్టం జరుగుతుందని భావించి రిజక్ట్ చేశాడు. ఇంతకీ బన్నీ అంత డబ్బు వదులుకోవడానికి కారణమైన ఆ యాడ్‌ ఏదో తెలుసా..

సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఓవైపు యాడ్స్‌లోనూ నటిస్తున్నాడు అల్లుఅర్జున్‌. కూల్‌డ్రింక్స్‌, ట్రావెలింగ్‌ సంబంధించిన యాప్‌ల యాడ్స్‌తో పాటు ఫుడ్‌ డెలివరీ యాప్‌లకు సంబంధించి ప్రకటనదారుడిగా నటించారు. తాజాగా
ఓ పొగాకు సంస్థ తమ యాడ్‌ కోసం కేవలం గంటపాటు కెమెరా ముందుకు వస్తే రూ.10 కోట్లు ఇస్తామని బన్నీకి చెప్పింది. అలాంటి ప్రకటనల్లో నటిస్తే ఫ్యాన్స్‌ కూడా తనని చూసి పొగాకు ఉత్పత్తులకు అలవాటు అవుతారని, అందుకే తాను ఆ ప్రకటన చేయను అని రిజక్ట్‌ చేసేశాడు బన్ని. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అభిమానులకోసం ఆలోచించి బన్నీ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat