గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకొన్నది. గతంలో జరిగిన సమావేశాల్లో భాగంగా శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిన్న బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి.
ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. డీఆర్డీవోల దగ్గర రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో 7,651 మంది విధుల్లో చేరబోతున్నారు.
తమను తిరిగి విధుల్లోకి తీసుకొన్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలియజేశారు. పలు చోట్ల వారి చిత్ర పటాలకు క్షీరాభిషేకాలు జరిపారు.