లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చైతూ తాజాగా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. చాలా మంది అభిమానులు తన చేతిపై ఉన్న టాటూకు అర్థం ఏంటని అడుగుతున్నారని, కొందరు దాని మీనింగ్ తెలియకున్నా వారూ అదే వేయించుకోవడం చూశా అని చెప్పారు చైతన్య. ఇంతకీ దాని అర్థం ఏంటంటే సామ్‌తో జరిగిన పెళ్లి తేదీని అలా టాటూగా వేయించుకున్నాడట చైతూ. అందుకే ఆ టాటూ అంటే చైకి చాలా ఇష్టమని, ఈ టాటూ విషయంలో నన్ను ఎవరూ ఫాలో అవ్వొద్దు అని క్లారిటీ ఇచ్చారు చైతూ.
సమంతతో విడిపోయిన తర్వాత ఆ పచ్చబొట్టు తొలగించాలని అనిపించలేదా అని ఓ యాంకర్ అడగగా.. దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా చేతిపై ఈ టాటూ ఉండడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు చైతన్య. అంతే కాకుండా తనకు ఇప్పుడు సమంత ఎదురైతే హాయ్ చెప్పి హగ్ చేసుకుంటాడట చైతూ.