సినిమా ఇండస్ట్రీలో వివాహం, గర్భధారణ విషయంలో తనపై వస్తున్న విమర్శలు, పుకార్లను చిరునవ్వుతో ఎదుర్కొంటున్న అలియాభట్ ను చూస్తుంటే గర్వంగా ఉందని బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ చెప్పింది. కెరీర్లో ఉన్నతమైన దిశగా ఆమె ప్రయాణిస్తోందని పేర్కొంది. అలియా కన్నా పెద్ద స్టార్ లేరనిపిస్తోందని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టిలో ఆమె ఉన్నతమైన వ్యక్తి అని కొనియాడింది.
