బర్త్ డే సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్‌కు గ్రీటింగ్స్ తెలిపారు. ‘ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేశ్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని, సక్సెస్‌ను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేశ్ బాబు’ అని ట్వీట్ చేశారు. మహేశు మరికొంతమంది ప్రముఖులు విషెస్ తెలిపారు.
