బిహార్లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో రూ.6000 కోట్లకు పైగా డబ్బు జమైంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఆయన ఖాతాకు పంపింది ఎవరో తెలియడం లేదు. సుమన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఆయనకు కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్ అకౌంట్ ఉంది. ఇటీవల ఆయన ఈ అకౌంట్ చెక్ చేసుకోగా వారం రోజుల క్రితం అందులో రూ.6,833.42 కోట్ల కనిపించడంతో సుమన్ షాకయ్యారు. ఇప్పటికీ ఆ డబ్బు మొత్తం ఆయన ఖాతాలోనే ఉంది. ఎవరో పొరపాటున మనీ ట్రాన్స్ఫర్ చేసుంటారు అనుకుందాం అంటే ఇంతవరకు ఈ విషయమై ఎటువంటి పోలీస్ కేసు నమోదు కాలేదు.
