తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రానున్న NTR30 సినిమా షూటింగ్ మరికొంత ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆచార్య తర్వాత వెంటనే ప్రారంభించాలని కొరటాల భావించినా.. స్క్రిప్ట్స్ మరింత దృష్టి పెట్టాలని తారక్ సూచించినట్లు టాక్. దీంతో నవంబర్ వరకు షూటింగ్ షురూ కాదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ రెండు నెలలు జిమ్ లో గడపనున్నాడు.