దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16,167 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే 15,549 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 1,35,510కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.50 శాతానికి చేరింది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ల పంపిణీ 206.56 కోట్లకు చేరింది
