ఒక పక్క అందాలను ఆరబోస్తూ.. మరోపక్క చక్కని అభినయంతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న హాటెస్ట్ భామ .. స్టార్ హీరోయిన్.. నేషనల్ క్రష్ రష్మిక.. తాను నటించిన చిత్రాలు వరుసగా హిట్ల పై హిట్ల్ కొట్టడంతో ఈ ముద్దుగుమ్మ భారీగా రెమ్యునరేషన్ పెంచేసినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సునీల్… అనసూయ.. రావు రమేష్ తదితరులు ప్రధానపాత్రలో నటించగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ హాటెస్ట్ భామ . పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పుష్ప సినిమా ముందు వరకు రష్మిక రూ.కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుందట.