తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి చిన్న వయసులో ఎంట్రీచ్చిన ముద్దుగుమ్మ కృతిశెట్టి. తాను నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని స్టార్ హీరోయిన్ కృతిశెట్టి తెలిపింది. ఉప్పెన తర్వాత చాలా వరకు అలాంటి పాత్రలే వచ్చాయి..
అయితే జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నానని చెప్పింది. మాచర్ల నియోజకవర్గం ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘నితిన్ చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అందమైన అమాయకత్వం ఉంది. ఈ మూవీలో నా పాత్ర పేరు స్వాతి. నేను విన్న వెంటనే ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది’ అని పేర్కొంది.