మహరాష్ట్రలో రాజకీయ వివాదం తర్వాత ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటూ ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే-బీజేపీ కూటమికి తొలి నుంచి సవాల్ విసురుతున్న శివసేన చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేకు భారీ షాక్ తగిలింది.
తాజాగా 62 మండలాల్లోని 271 పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. ఇందులో బీజేపీ మద్దతుదారులు 82 స్థానాలు కైవసం చేసుకున్నారు. NCP 53, శివసేన (షిండే వర్గం) 40 స్థానాలు గెలుచుకుంది. శివసేన (ఉద్దవ్ వర్గం) 27, కాంగ్రెస్ 22 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 47 చోట్ల గెలిచారు.