దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో పేరున్న అందరూ 2023 ఏప్రిల్ 1లోగా తమ ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ప్రకటించింది. ప్రతి ఒక్కరూ 6B ఫారం ద్వారా తమ ఆధార్ నంబర్ ను సంబంధిత ఎన్నికల అధికారికి ఇవ్వాలని సూచించింది. అయితే ఈ అనుసంధాన ప్రక్రియ ఐచ్ఛికమే అని.. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఆధార్ లేకపోతే ఎన్నికల అధికారులు కోరే ఇతర డాక్యుమెంట్లను 6B ఫారం ద్వారా సమర్పించవచ్చని తెలిపింది.
