తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. నేడో రేపో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు. తాజాగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తనకు సీటు రాదు. ఇటీవల టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కార్పోరేటర్ విజయారెడ్డికి వస్తుందని ముందస్తు సమాచారంతోనే శ్రావణ్ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.
