విభిన్న కథాంశాలతో అలరిస్తున్న సత్యదేవ్ కొత్త సినిమా ‘కృష్ణమ్మ’ టీజర్‌ను హీరో సాయితేజ్ ఈ రోజు రిలీజ్ చేశారు. గాడ్సేగా ఇటీవల ఆకట్టుకున్న సత్యదేవ్ ఇందులో భవానీ మాల ధరించి చేతలో కత్తి పట్టుకొని శత్రువులను పరుగెట్టిస్తున్నట్లు కనిపించారు. సినిమాలో సత్యదేవ్, ఆయన స్నేహితులు అనాథలని తెలుస్తోంది. ఈ కృష్ణమ్మలాగే మేము ఎక్కడ పుట్టామో, ఎలా పుట్టామో ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడు పుట్టినా, ఎలా పుట్టినా పుట్టిన ప్రతివాడికి ఏదో ఒక కథ ఉండే ఉంటుంది అని హీరో చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.
