దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవేలపై 6 నెలల్లో టోల్ ప్లాజాలను ఎత్తేసి కొత్త వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫాస్టాగ్ స్థానంలో GPS లేదా నంబర్ ప్లేట్ ఆధారిత విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వచ్చే మూడేళ్లలో 26 గ్రీన్ ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తామని తెలిపారు. రెండేళ్లలో దేశంలోని రోడ్లు USతో సమానంగా ఉంటాయన్నారు.
