భారతదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,893 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి నిన్న ఒక్కరోజే 53 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.94శాతంగా ఉంది. 24 గంటల్లో కరోనా నుంచి 20,419 మంది కోలుకోవడం ఉపశమనం కలిగిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,478కు చేరింది. రికవరీ రేటు 98.50 శాతంగా.. యాక్టివ్ కేసులు 0.31%గా ఉన్నాయి.
