ఏపీలోని విశాఖ ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’గా ఎంపికయ్యింది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోచిలో నిర్వహించిన పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల యువతులు పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన ఛరిష్మా విజేతగా నిలిచింది. ఈమె చదువుకుంటూనే నృత్య కళాకారిణిగా, నటిగా రాణిస్తోంది.
