టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి గత కొన్ని నెలలుగా మంచి స్కోర్ చేసేందుకు ఇబ్బందిపడుతుండటం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. విరాట్ కోహ్లి తిరిగి ఫామ్లోకి రావాలని కోరుకుంటూ గతంలో చేసిన పరుగులను గుర్తుచేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు బర్మింగ్ హామ్లో జరిగిన ఇంగ్లండ్-ఇండియా టెస్ట్ లో కోహ్లి 149 రన్స్ చేశాడు. ఇలాంటి కోహ్లిని మళ్లీ చూడాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
