తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన అర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన పోలీసులు అరెస్టు చేశారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్యేపై కిల్లెడ సర్పంచ్ భర్త కక్ష పెంచుకున్నాడు.
ఎలాగైనా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేయాలని హైదరాబాద్ మహనగరంలోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి దగ్గర అనుమానాస్పదంగా నిందితుడు తిరుగుతుండగా బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2 పిస్టళ్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు.