ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాల పరిష్కారానికి ప్రతి మండల కేంద్రంలో శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో జగన్ మాట్లాడారు. ‘జగనన్న భూరక్ష’ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ట్రైబ్యునళ్లు కొనసాగించాలని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా భూసర్వేలో తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు సరైన యంత్రాంగం ఉండాలని సీఎం ఆదేశించారు. మొబైల్ ట్రైబ్యునల్ యూనిట్లు ఉండాలని.. దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని జగన్ స్పష్టం చేశారు. భూవివాదాల పరిష్కారానికి అత్యుత్తమ వ్యవస్థ తీసుకురావాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.