వైజాగ్ బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ, లవర్ రవితో మళ్లీ సిటీకి తిరిగొచ్చింది. ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తాము పెళ్లి చేసుకున్నామని.. కలిసే ఉంటామని చెప్పారు. ఎలాంటి హని జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. ఇరువైపుల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
తమ బిడ్డలు చేసిన పనికి పరువు పోయిందని.. తలదించుకోవాల్సి వచ్చిందని, తాము వారిని ఇళ్లకు తీసుకువెళ్లబోమని వారు స్పష్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత రవి, సాయిప్రియలను స్టేషన్ నుంచి పోలీసులు పంపించేశారు.