ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం ఇంకా అధికంగానే ఉంది. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఒడ్డు కోతకు గురై ఓ ఆలయం కొట్టుకుపోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో చోటుచేసుకుంది.
శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలోని గోదావరి ఒడ్డున ఉన్న వనదుర్గ ఆలయం ఓ పక్కకి ఒరిగిపోవడాన్ని గ్రామస్థులు గుర్తించారు. దీంతో భయాందోళలకు గురై ఆలయ పరిసరాల్లోకి వెళ్లడం మానేశౄరు. సాయంత్రానికి ఆలయం మరింత కుంగి.. కాసేపటికి అమ్మవారి విగ్రహంతో సహా అలా వరదలో కొట్టుకుపోయింది.