సినిమా ఇండస్ట్రీలో పద్నాలుగేళ్ళ వయసులోనే ఎంట్రీ ఇచ్చి, తన సహజ నటనతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటి జయసుధ.తాజాగా జయసుధ ఓ ఇంటర్వూలో తన 50ఏళ్ళ సినీ కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను చూశానని చెప్పింది. అంతేకాకుండా ఇండస్ట్రీపై, హీరోయిన్లపై వివక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.’50ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్లో అయితే ఫ్లవర్ బొకేలైనా పంపేవారని, ఇక్కడ ఫ్లవర్ బొకేలు కూడా పంపించినవారు లేరని.. అదే హీరోలకైతే హడావిడి చేశారని’ తెలిపింది.
చాలా మంది తనతో మీరెందుకు పెద్ద పార్టీ ఇచ్చి 50 ఏళ్ళ సక్సెస్ ఫుల్ జర్నీను సెలబ్రెట్ చేసుకోకూడదని అన్నారని , కానీ తనకది వద్దని అనిపిందని తెలిపింది. స్టార్ హీరోయిన్ అయిన ఇండస్ట్రీలో వివక్ష ఉంటుందని.. తను ఎక్కువగా డిమాండ్ చేసిన, ట్రబుల్ చేసిన 50ఏళ్ళు తనను ఇండస్ట్రీలో ఉంచేవారు కాదని తెలిపింది.
టాలీవుడ్లోకి ముంబై నుండి హీరోయిన్ వస్తే ఒకలా ట్రీట్ చేస్తారని, కుక్క పిల్లకు కూడా ఒక రూమ్ ఇస్తారని సంచలన విషయాలను చెప్పింది. కంగానా రనౌత్‌కు పద్మశ్రీ ఇచ్చారని.. అలాంటప్పుడు ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉంటున్న తనకు ఎందుకు పద్మశ్రీ ఇవ్వలేదని చాలా మంది అడిగినట్లు తెలిపింది. అంతేకాకుండా మా బిల్డింగ్ గురించి, పాలిటిక్స్ గురించి కూడా పలు విషయాలను ఈ ఇంటర్వూలో తెలిపింది.