దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,408 కరోనా పాజిటీవ్ మహమ్మారి కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,40,00,138కి చేరాయి. ఇందులో 4,33,30,442 మంది బాధితులు కోలుకున్నారు.
ఇప్పటివరకు 5,26,312 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,43,384 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 54 మంది మరణించగా, 20,958 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.