నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేసిన విపక్ష ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 24 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో 50 గంటల ధర్నా చేస్తున్నారు.
అయితే పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టెంటు వేసుకునేందుకు విపక్ష ఎంపీలకు అనుమతి లభించింది. దీంతో వాళ్లు ఓపెన్‌గానే నిద్రపోయారు. వర్షం పడడంతో పార్లమెంట్ ఎంట్రెన్స్ వద్ద బెడ్ షీట్లు వేసుకుని నిద్రించారు.
కొందరు ఎంపీలు దోమతెరలను వాడారు. నిరసన చేపడుతున్న విపక్ష ఎంపీలకు డీఎంకే లంచ్‌లో ఇడ్లీలు ఏర్పాటు చేసింది. ఇక టీఎంసీ తమ సభ్యులకు చేపల్ని తెచ్చి పెట్టింది. ఆందోళన చేస్తున్న ఎంపీలకు టీఆర్ఎస్ డిన్నర్ సర్వ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.