తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఉస్మాన్‌సాగర్ (Osman Sagar) జలాశయంలోకి 8 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 13 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 8,281 క్యూసెక్కులు మూసీలోకి విడుదల చేశారు. ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుతం 1,789.10 అడుగుల నీటిమట్టం ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు.ఇక హిమాయత్‌సాగర్‌కు 10 వేల క్యూసెక్కులు వస్తుండగా, 8 గేట్లు ఎత్తి 10,700 క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1762.70 అడుగులు. గరిష్ఠనీటిమట్టం 1763.50 అడుగులు.