దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో అంటే నిన్న మంగళవారం 14,830 కేసులు నమోదయ్యాయి. కానీ అవి తాజాగా సంఖ్య 18,313కు పెరిగాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ యాక్టీవ్ కేసులు 4,39,38,764కు చేరాయి.
ఇందులో 4,32,67,571 మంది కరోనా మహమ్మారి భారిన పడి బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,167 మంది కరోనాతో కన్నుమూశారు. మరో 1,45,026 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 57 మంది మృతిచెందగా, 20,742 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.