పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఉపాధ్యాయ నియాకాల్లో జరిగిన అవకతకల వ్యవహారంలో టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టైన తర్వాత ఆ పార్టీ తుఫాన్ చెలరేగిందన్నారు.
టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది డైరెక్ట్‌గా తనతోనే టచ్‌లో ఉన్నారని చెప్పారు. మహారాష్ట్రలో ఇటీవల ప్రభుత్వం మారిన నేపథ్యంలో మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ్ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.