కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు మంగళవారం ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు. దేశం లోనే సంచలనం సృష్టించిన ప్రముఖ పత్రిక కేసు అయిన నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో రెండో సారి సోనియా గాంధీ ఈరోజు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.
ఢిల్లీలోని తన ఇంటి నుంచి సోనియా బయలుదేరిన సమయంలో ఆమె వెంట రాహుల్, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. జూలై 21వ తేదీన తొలిసారి ఈడీ సోనియా విచారించిన విషయం తెలిసిందే. మరో వైపు ఆ పార్టీలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ చేపట్టారు. విపక్ష నేతల్ని బీజేపీ వేధిస్తోందని డీకే శివకుమార్ ఆరోపించారు.