నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 57,669గా ఉన్నది. విద్యుత్ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 544.50 అడుగుల నీరుండగా.. పూర్తిస్థాయినీటిమట్టం 590 అడుగులు. సాగర్ డ్యామ్ గరిష్ఠస్థాయి 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
