బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు కరోనా వైరస్ సంక్రమించింది. ఆయన గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అధికార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ వీడ్కోలు, రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి నితీశ్ హాజరుకాలేకపోయారు.
