వరద బాధితులను పరామర్శించేందుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. పుచ్చకాయలపేటలో వరదబాధితులను పరామర్శించారు. ఈ క్రమంలోఅక్కడ ఉన్న నక్కా విజయలక్ష్మి 8 నెలల కుమారుడిని సీఎం ఎత్తుకున్నారు.
ఈ సమయంలో సీఎం జేబులో ఉన్న పెన్ను బాలుడు తీసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అది కాస్త కింద పడింది. వెంటనే అధికారులు ఆ పెన్ను తిరిగి సీఎం జగన్‌కు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆ పెన్ను బాలుడికి సీఎం గిఫ్ట్‌గా ఇచ్చేశారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. స్వయంగా సీఎం ఉపయోగించే పెన్ తమకు ఆయనే గిఫ్ట్‌గా అందించడంపై వారు సంబరపడిపోయారు. ఇంతకీ ఆ పెన్ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 40వేల రూపాయలట.