సినిమాల్లో నటిస్తే తీసుకునే రెమ్యునరేషన్ విషయంలో ఇటీవల పెళ్లి చేసుకున్న సీనియర్ మోస్ట్ టాప్ హీరోయిన్ నయనతార సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో తానోక లేడీ సూపర్ స్టార్ గా ప్రఖ్యాత గాంచిన నయనతార తన పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా తన 75వ చిత్రం ప్రారంభమైంది. నీలేశ్ డైరెక్షన్ లో రూపొందనున్న ఈ మూవీకి ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. దక్షిణాదిలో ఈస్థాయిలో పారితోషికం అందుకోబోతున్న తొలి హీరోయిన్ గా నయనతార చరిత్ర సృష్టించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.