మన దేశంలో రాష్ట్రపతుల ప్రమాణం జులై 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?. తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా మన దేశపు తొలి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు.
తర్వాత వచ్చిన ఆరుగురు రాష్ట్రపతులు పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. 1977 జులై25న నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి అందరూ(జ్ఞాని జైల్సింగ్ మినహా) విజయవంతంగా పదవీకాలాన్ని పూర్తిచేశారు. జులై 25న బాధ్యతలు స్వీకరించి, ఐదేళ్ల తర్వాత జులై24న పదవీ విరమణ చేయడం ఆనవాయితీగా మారింది. ఈ జాబితాలో చేరే పదో వ్యక్తి ముర్ము.