రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
దేశవ్యాప్తంగానూ 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీ సహా 19 రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. గుజరాత్‌లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.