తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖమంత్రి,అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రేపు పుట్టిన రోజు సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారకరామారావు తెలిపారు.
వర్షాల వలన, పలు జిల్లాల్లో వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం కింద ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ గారు విజ్ఞప్తి చేశారు.