టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగ డ్రాయింగ్ ఆర్టిస్ట్ స్వప్నిక్ అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. చిన్నతనంలో విద్యుత్‌షాక్‌తో రెండు చేతులూ కోల్పోయిన స్వప్నిక.. నోటితోనే పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నారు. సందర్భాన్ని బట్టి పొలిటికల్ లీడర్స్, సినీ హీరోల డ్రాయింగ్‌ను ఆమె వేస్తూ ఉంటుంది.
కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటాన్ని స్వప్నిక గీసింది. కేటీఆర్ చేసే సేవా కార్యక్రమాలు.. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన దివ్యాంగ చెక్ క్రీడాకారిణికి ఆయన అందించిన సహకారం తనను ఎంతో ఆకట్టుకున్నాయని ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ చిత్రపటాన్ని గీసి ఆయనపై తన అభిమానాన్ని చాటుకుంది స్వప్నిక.