హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి చిరుజల్లులు పడుతూనే ఉండగా.. సాయంత్రం నుంచి భారీ వర్షం పడింది. ఇటు పటాన్ చెరు నుంచి అటు అబ్దుల్లాపూర్‌మెట్ వరకు వర్షం కురుస్తూనే ఉంది.
అమీర్‌పేట్, నాంపల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.