దేశంలో గత రెండు వారాలుగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు.ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కరోనా బాధితుల సంఖ్య అధికమవుతుండటంతో రోజువారీ కేసుల సంఖ్య 21 వేలు దాటాయి.
గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 21,566 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,38,25,185కు చేరాయి. ఇందులో 4,31,50,434 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,870 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,48,881 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి.