ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ పోలీసులను ఆశ్రయించారు. సినీ నిర్మాత శేఖర్రాజుపై పంజాగుట్ట పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసుతో కోర్టును తప్పుదోవ పట్టించారని.. కోర్టు ఆదేశాలతో ‘లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ ’ సినిమాను నిలుపుదల చేశారని చెప్పారు.
నిర్మాత శేఖర్రాజుకు తాను ఇవ్వాల్సిందేమీ లేదని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వర్మ కోరారు. ఆయనే తనకు డబ్బు ఇవ్వాలని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలనే పోలీసులను ఆశ్రయించినట్లు ఆర్జీవీ మీడియాకు తెలిపారు.