ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ పీటీ ఉష ఈ రోజు బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. హిందీ భాషలో ఆమె ప్రమాణం చేయడం ఇక్కడ విశేషం. లెజండరీ అథ్లెట్ పీటీ ఉషతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, ఫిల్మ్ రైటర్ వీ విజయేంద్ర ప్రసాద్, ఆధ్యాత్మిక నేత వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు కేంద్రం నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
