త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్రం తెలిపింది. ఆర్మీలో 1,16,464, నేవీలో 13,537, ఎయిర్పోర్స్లో 5,723 ఖాళీలున్నట్లు పేర్కొంది. అగ్నివీరుల భర్తీ సంఖ్య కంటే సగటు నియామకాల సంఖ్య ఎక్కువగా ఉందా? అయితే సాయుధ దళాల్లో సిబ్బంది కొరత ఎలా తీరుస్తారు? అన్న ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇవ్వలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం పరిధిలో ఉందని బదులిచ్చింది.
