మహారాష్ట్రలో ఓ దారుణం జరిగింది. బాలికపై ఓ ఎస్ఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల జూలై 13న బాలికను కారులో ఎక్కించుకుని నాగ్ పూర్ నగరం మొత్తం తిప్పి చూపించిన ఎస్సై అనంతరం ఆమెకు మద్యం తాగించి, హోటల్ రూంకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఇంటికి తిరిగెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లైంగిక దాడికి పాల్పడిన ఎస్ఐని పోలీసులు అరెస్ట్ చేశారు.
