మహమ్మద్ ప్రవక్తపై కాంట్రవర్సియల్ కామెంట్స్ చేసిన బీజేపీ మాజీ మహిళా నేత నుపుర్ శర్మను చంపేందుకు ఓ వ్యక్తి ఏకంగా పాకిస్థాన్ వచ్చేశాడు.
పాకిస్థాన్లోని మండీ బహుద్దీన్ పట్టణానికి చెందిన రిజ్వాన్ అష్రఫ్ అనే వ్యక్తి రాజస్థాన్ సరిహద్దు నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బందికి అతడు పట్టుబడంతో వారు విచారించారు.
నిందితుడి వద్ద 11 అంగుళాల కత్తి ఉన్నట్లు గుర్తించారు. నుపుర్ శర్మను చంపేందుకే బోర్డర్ దాటి వచ్చినట్లు ప్రాథమిక విచారణ రిజ్వాన్ తెలిపాడు.