ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ప్రాంతానిని వరద ముప్పు ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, నేతలతో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పువ్వాడ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చేసి మూడు మీటర్ల ఎత్తు పెంచుకున్నారని ఆయన ఆరోపించారు.
ఏపీలో విలీనమైన 7 మండలాలు, భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని అజయ్ డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తు తగ్గించాలని చాలాసార్లు కోరామని.. ఆ బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. భద్రాచలం ముంపు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం దిశగా త్వరలోనే చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు.