తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు ఉదయ్ తన జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దినేష్ చౌదరి గారితో కల్సి తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు గారు ,పువ్వాడ అజయ్ గారిని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో కలిశారు.
ఈ సందర్భంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రంలోని వరద సహాయ చర్యల కొరకు 2లక్షల రూపాయిలు విరాళంగా అందించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు ఇటువంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అట్లూరి నారాయణ రావు గారు, తాడికొండ సాయికృష్ణ,శివ వీరపనేని పాల్గొన్నారు.