అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరానికి చెందిన లెక్సీ లార్సన్ గతంలో అకౌంటెంట్‌గా పనిచేసేది. ఇటీవలే ఆమె టెక్నికల్ బాధ్యతలు నిర్వర్తించాల్సిన జాబ్‌లో చేరింది. తనకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో వివరిస్తూ టిక్‌టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. తన శాలరీ, ఇతర వివరాలు కూడా వెల్లడించింది.
ఒకప్పుడు 70 వేల డాలర్లు సంపాదించే తనకు ప్రస్తుతం 90 వేల డాలర్లు వస్తోందని పేర్కొంది. ఈ వీడియో కంపెనీ యాజమాన్యానికి చేరడంతో లెక్సీకి భారీ షాక్ తగిలింది. లెక్సీకున్న టిక్‌టాక్ అలవాటు కారణంగా తమకు భద్రతాపరమైన సమస్యలు వస్తాయంటూ కంపెనీ ఆమెను జాబ్ నుంచి తొలగించింది.
లెక్సీ పొరపాటున ఏదైనా కీలక వివరాలు వెల్లడించే ప్రమాదం ఉన్నందునే ఇలా చేశామని తేల్చి చెప్పింది.ఈ విషయాలన్నిటినీ లెక్సీ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. టిక్‌టాక్ వల్ల తన ఉద్యోగం పోయిందంటూ బావురుమంది.భారీ శాలరీతో కొత్త ఉద్యోగంలో చేరిన ఓ యువతికి భారీ షాక్ తగిలింది. టిక్‌టాక్ వీడియోలో ఆమె తన శాలరీ గురించి వెల్లడించి, చివరకు ఉద్యోగం పోగొట్టుకుంది. రెండు వారాలకే జాబ్ పోవడంతో ఆమెకు దిమ్మతిరిగినంత పనైంది